తెలంగాణలో లాక్ డౌన్, కర్ఫ్యూ ఉండదు.. జాగ్రత్తలు పాటించాలి- ఈటల

నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. అయితే ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలు లేవని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గతంలో 5 శాతం మంది బాధితుల్లో లక్షణాలు లేకుండా ఉంటే.. ప్రస్తుతం 95 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదన్నారు. గతంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన తర్వాత రిపోర్టు రావడానికి చాలా సమయం పట్టేదన్నారు. ప్రస్తుతం గ్రామాల్లోని పీహెచ్ సీల వరకు ర్యాపిడ్ టెస్టులు అందుబాటులో ఉన్నందున ఫలితం వెంటనే తెలిసిపోతుందని చెప్పారు. కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయిన తర్వాత బాధితులకు లక్షణాలు ఉంటే వెంటనే కరోనా కిట్ ఇచ్చి వారిని హోం ఇసోలేషన్ కు తరలించడం.. లక్షణాలు ఉన్నట్లయితే ఆస్పత్రులకు పంపించి చికిత్స అందిస్తు్న్నట్లు తెలిపారు.

అయితే, తప్పకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. గత కొంత కాలంలో తెలంగాణ లాక్ డౌన్ అంటూ ప్రచారం చేస్తున్నారని, దానిని ఎలాంటి నిర్ణయం లేదని, ప్రజలు అపోహలు నమ్మద్దని కోరారు. గతంలో ఏర్పాటుచేసిన కొవిడ్ కేంద్రాలన్ని.. ఇప్పుడు అందుబాటులోనే ఉన్నాయని, కరోనా మహమ్మారిని కట్టిడి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు. అయితే, తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తే.. ఎలాంటి అసోహలు ఉండవని తెలిపారు.

కరోనా చికిత్సను ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాపారకోణంలో చూడొద్దని ఆయన అన్నారు. సామాజిక బాధ్యతగా ప్రైవేట్ ఆస్పత్రులు సేవలు అందించాలన్నారు. కరోనా ఫీజు సాధ్యమైనంత తగ్గించి తీసుకోవాలని కోరారు. సెకండ్ వేవ్ ప్రభావం మరికొంత కాలం ఉంటుందన్నారు.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నట్లు ఈటల తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో టెస్టులు, వ్యాక్సినేషన్‌ కొనసాగుతోందన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఐసోలేషన్‌ సెంటర్లూ అందుబాటులో ఉన్నాయన్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిని విధిగా మానిటర్‌ చేస్తున్నట్లు చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బందిని సమకూర్చుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.