వకీల్ సాబ్ సెన్సార్ పూర్తి, క్లీన్ యూ/ ఏ సర్టిఫికెట్

బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం పింక్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. వేణు శ్రీ రామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని దిల్ రాజు – బోనీకపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అంజలి, నివేత థామస్, అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ కి ప్రత్యర్థి లాయర్ గా కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 9 న చిత్ర రిలీజ్ సందర్భంగా నిన్న (ఏప్రిల్ 4 )న శిల్పకళావేదికలో ప్రీరిలీజ్ ఈవెంట్ ని జరుపుకున్నారు. ఈ రోజు వకీల్ సాబ్ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యూ/ ఏ సిర్టిఫికెట్ సంపాదించింది.

Load More Related Articles
Load More By admin
Load More In మూవీస్

Leave a Reply

Your email address will not be published.