చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతూ అడ్డంగా బుక్కైన బాలీవుడ్‌ నటుడు

ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌గా‌ చేసుకుని చైన్ స్నాచింగ్ ‌కు పాల్పడుతోన్న ఓ నటుడిని గుజరాత్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు.. రెండు రోజుల కిత్రం సూరత్‌లో రోడ్డుపై వెళ్తోన్న మహిళ మెడలో నుంచి చైన్‌ లాక్కుని వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు తెలిశాయి. అరెస్ట్‌ చేసిన వారిలో ఒక వ్యక్తి బాలీవుడ్ టీవీ సీరియల్‌ నటుడు మీరజ్‌ కపాడి కాగా మరొకరిని బిల్లర్‌ వైభవ్‌ జాదవ్‌గా గుర్తించారు పోలీసులు. క్రికెట్‌ బెట్టింగ్‌ వల్ల అప్పుల పాలైన వీరిద్దరూ చైన్‌ స్నాచర్స్‌గా మారారని పోలీసులు తెలిపారు.

ముంబైలో ఉంటున్ననటుడు మీరజ్‌ కపాడి ఇప్పటికే పలు టీవీ సీరియళ్లలో నటించాడు. అంతే కాదు తన స్నేహితులకు సీరియల్స్‌లో కూడా అవకాశం ఇప్పించాడు. అయితే ఇతడికి క్రికెట్‌ బెట్టింగ్‌ అంటే పిచ్చి. దాంతో చాలా డబ్బు పొగొట్టుకోవడమే కాక అప్పుల పాలయ్యాడు. ఇలాంటి సమయంలో ఇంతడికి బిల్లర్‌ వైభవ్‌ జాదవ్‌ పరిచయమయ్యాడు. అతడు కూడా బెట్టింగ్‌ వల్ల అప్పుల పాలయ్యాడు. దాంతో ఇద్దరు కలిసి సూరత్‌లో ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. 

ఇక వీరి వద్ద నుంచి మూడు తెగిపోయిన గొలుసులతో పాటు 2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుల్లో వైభవ్‌పై ఇప్పిటకే 12 కేసులు నమోదయ్యాయి. రాజ్‌కోట్, కేశోడ్, జునాగఢ్‌, అహ్మదాబాద్‌లతో సహా వెరవాల్‌ ప్రాంతాల్లో ఇతడిపై నేరాలు నమోదయ్యాయి. అంతేకాక గతంలో వీరిద్దరూ వీధుల్లో పార్క్‌ చేసిన కార్లను కూడా దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. 

Load More Related Articles
Load More By admin
Load More In క్రైమ్

Leave a Reply

Your email address will not be published.