నాగార్జున సాగర్ లోక్ సభ ఉప ఎన్నికలో 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ స్థానం కోసం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలవుతాయని అధికారులు ముందే ఊహించారు. దానికి తగ్గట్లుగానే 72 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో వివిధ పార్టీ నేతలతో పాటు స్వతంత్రులు కూడా ఉన్నారు.
నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం మూడు రోజుల గడువిచ్చింది. ఈ నెల 1 నుంచి ఇవాళ్లి వరకు నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించింది. రెండో రోజున ముగ్గురు, మూడో రోజున 16 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్ కుమార్, బీజేపీ పార్టీ నుంచి రవికుమార్ నాయక్ బరిలో ఉన్నారు.