కొత్త ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని

గురువారం ఎస్‌ఈసీగా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఆమె నిర్ణయం తీసుకోనున్నారు. పది రోజుల్లో ఎన్నికలను పూర్తి చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్‌ 8వ తేదీన ఎన్నికలు.. 10న ఫలితాలు విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులతో ప్రభుత్వ అధికారుల సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. ఏపీ కొత్త ఎస్‌ఈసీని ప్రభుత్వం నియమించింది. మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. దీనిని గవర్నర్ ఆమోదించారు.

ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఎస్‌ఈసీని నియమించేందుకు ప్రభుత్వం నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను ప్రతిపాదించింది. చివరికి సాహ్నిని ఎంపిక చేశారు. ఆమె ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత సీఎం జగన్‌ను ప్రధాన సలహాదారుగా నియమించారు. సాహ్ని రెండేళ్ల పాటు సలహాదారుగా ఉంటారు. అయితే అంతలోనే అనూహ్యంగా ఎస్‌ఈసీగా నియమించడం గమనార్హం.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.