వ్యాట్సాప్ చేస్తే రూ.10 వేలు.. వైసీపీకి టీడీపీ షాక్…

7557557744 నెంబర్ కు వీడియో, ఆడియో, ఫోటో వాట్సాప్ చేయండి. మీ అకౌంట్ లో పదివేలు వేస్తాం.. ఈ ఆఫర్ తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు మాత్రమే.. ఉప ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అధికార పార్టీకి ఓట్లు వేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవంటూ బెదిరించే వారికి కౌంటర్ గా వాట్సాప్ ఆఫర్ ప్రకటించింది.

వాలంటీర్లు గానీ, అధికార పార్టీ వాళ్లు కానీ బెదిరిస్తే… వెంటనే తమకు వాట్సాప్‌లో సమాచారం అందించాలని పిలుపిచ్చారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. వైసీపీకి ఓటెయ్యకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల గుట్టురట్టు చేయాలన్నారు. అలా బెదిరించే కాల్ రికార్డు కానీ, ఫోటో కానీ, వీడియో కానీ.. 7557557744 అనే నెంబర్‌కు వాట్సాప్ చేస్తే సంబంధిత వ్యక్తుల అకౌంట్‌లో 10వేలు వేస్తామని చెప్పారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందన్నారు అచ్చెన్న.

రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. తిరుపతిలోనే టీడీపీకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే, అధికార పార్టీ బెదిరింపులతో ఓటమి తప్పలేదన్నారు. పథకాలు పోతాయనే భయం అవసరం లేదని… ఆ డబ్బులు జగన్ రెడ్డి తాత డబ్బులో.. తండ్రి డబ్బులో కాదని.. అవి ప్రజల డబ్బులన్నారు. 10 పైసలు ఇచ్చి.. 90 పైసలు దోచుకుంటున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే.. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.