భారత ఓపెనర్లు రోహిత్‌-ధావన్ ఖాతాలో అరుదైన రికార్డు…

ప్రస్తుతం భారత జట్టుకు ఉన్న అన్ని ఓపెనింగ్ జోడిలలో టాప్ లో ఉండేది రోహిత్ శర్మ అలాగే శిఖర్ ధావన్. అయితే ఇప్పుడు ఈ జోడి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. వీరిద్దరూ కలిసి వన్డేల్లో 5000లకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనత అందుకున్న ఏడో ఓపెనింగ్‌ జోడీగా చరిత్ర సృష్టించారు. ఇక భారత్ నుంచి ఇంతకముందు సచిన్ టెండ్యూలర్-సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘటన సాధించారు. అయితే పూణే వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ల జోడి 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో వీరి భాగస్వామ్యం మొత్తంగా 5000 పరుగులు దాటేసింది. వన్డేల్లో అందరికన్నా ఎక్కువ పరుగులను సాధించిన ఓపెనింగ్‌ జోడీ సచిన్‌, గంగూలీదే. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8227 పరుగులు చేశారు. అయితే చూడాలి మరి ఈ జోడి ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తారా… లేదా అనేది.

Load More Related Articles
Load More By admin
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *