రంగ్ దే మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..!

నటీనటులు: నితిన్, కీర్తి సురేష్, నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు
సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్

ఎడిటర్: నవీన్ నూలీ
సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్
నిర్మాణ సంస్థ: (నాగవంశీ) సితార ఎంటర్టైమ్మెంట్స్
కథ, దర్శకత్వం: వెంకీ అట్లూరీ
స్క్రీన్ ప్లే : వెంకీ అట్లూరీ, సతీష్ చంద్ర

నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించాడు. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

అర్జున్ (నితిన్), అను (కీర్తి సురేష్) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. అనుకు అర్జున్ అంటే ప్రాణం. కానీ అర్జున్ కు అను అంటే ద్వేషం. అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. చదువు కోసం దుబాయ్ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. అయితే అప్పటి వరకు అనును ద్వేషించిన అర్జున్.. అక్కడ కొన్ని పరిస్థితుల కారణంగా ఇష్టపడతాడు. కానీ అదే సమయంలో అర్జున్ ని వద్దు అనుకుంటుంది అను. మళ్లీ వాళ్ళిద్దరు ఎలా కలిసారు అనేది కథ..

ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఒకే ఒక కథ ప్రేమ కథ. ఆకట్టుకునే విధంగా తీస్తే ఎన్నిసార్లు తీసిన లవ్ స్టోరీని ఆదరిస్తారు. కానీ మళ్లీ రోటీన్ ఫార్మెట్లో వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. నితిన్ రంగ్ దే అలాగే అనిపించింది. అబ్బా మళ్లీ అదే కథా.. కొన్ని సినిమాలు చూడగానే మనకు వచ్చే ఫస్ట్ ఫీలింగ్ ఇది. అందులో నితిన్ రంగ్ దే కూడా ఉంది. గజినీలా ఒకే కథను మళ్లీ మళ్లీ తీస్తున్నాడు వెంకీ అట్లూరి. తొలి ప్రేమ తొలిసారి కాబట్టి కనెక్ట్ అయింది. అదే కథను కాస్త మార్చి మళ్లీ ఇప్పుడు రంగ్ దే అంటూ వచ్చాడు. ఈ సినిమా చూస్తుంటే వద్దనుకున్నా ఎన్నో సినిమాలు గుర్తుకొస్తాయి. నువ్వే కావాలి, ఆనందం నుంచి నిన్న మొన్నటి తొలిప్రేమ వరకు.. చాలా సినిమాలు ఇందులో కనిపిస్తాయి. ఫస్టాఫ్ అంతా ఏదో కామెడీతో గడిచిపోయింది.. సెకండాఫ్ లో ఎమోషన్ లేక.. ఇటు కామెడీ లేక కలగాపులగం అయిపోయింది. క్లైమాక్స్ వరకు కన్ఫ్యూజన్ లోనే ఉండిపోయింది. మొదట హీరోయిన్ ను హీరో ద్వేషించడం.. ఆ తర్వాత హీరోను హీరోయిన్ ద్వేషించడం.. తన మొదటి రెండు సినిమాలలో వెంకి ఇదే కథ చెప్పాడు. ఇందులో కూడా కాస్త మార్చి మళ్లీ అదే కథను చూపించాడు. నితిన్, కీర్తి సురేష్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పిసి శ్రీరామ్ గారి వల్ల రంగ్ దే టైటిల్ కు న్యాయం జరిగింది. విజువల్స్ పరంగా సినిమా చాలా కలర్ ఫుల్ గా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు సేవియర్. వెంకీ అట్లూరి మరో ఛాన్స్ మిస్ చేశాడు అనిపించింది. ఓవరాల్ గా రంగ్ దే.. రొటీన్ రొమాంటిక్ డ్రామా.

రేటింగ్ : 2.75

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.