రౌడీయిజం చేయాలంటే దమ్ము ఉండాలి.. బజార్ రౌడి సినిమాలో సంపూ ఆకట్టుకునేలా డైలాగులు…

‘రౌడీయిజం చెయ్యాలంటే జీపు.. జీపులో పెట్రోలు.. దానిలో రౌడీలు కాదురా.. దమ్ము కావాలి’ అంటున్నారు బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేశ్‌ బాబు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బజార్‌రౌడి’. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షాయాజీ షిండే, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ‘బజార్‌ రౌడి’ టీజర్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగిన ఈ టీజర్‌లో సంపూర్ణేశ్‌ బాబు చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘హృదయకాలేయం’తో సంపూర్ణేశ్‌బాబు నటుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించిన ఆయన విభిన్న కథలతో వరుస సినిమాలు చేస్తున్నారు. తనదైన నటనతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు

Load More Related Articles
Load More By admin
Load More In మూవీస్

Leave a Reply

Your email address will not be published.