కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలోచించి నిర్ణయాలు తీసుకోవాలని భవన నిర్మాణ కార్మికుల ఫెడరేషన్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి రామమోహన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాలువ నాగేంద్ర బాబులు డిమాండ్ చేశారు. బద్వేలు పట్టణంలోని సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల మావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం మీద శ్రద్ద పెట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ధరలు పెరగడం కారణంగా …