టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్ దక్కడం కష్టమేనా..? నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే జరుగుతోందా..?సర్వేలో ఎమ్మెల్యేల పనితీరుపై ఏమాత్రం ప్రతికూల ఫలితం వచ్చినా హైకమాండ్ ఉపేక్షించే అవకాశం లేదా..?తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదికలో ఏముంది..? ఎస్కే నివేదిక ఆధారంగానే టి. కాంగ్రెస్ లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు, పార్టీ పదవుల భర్తీ జరగనుందా..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎస్కే టీమ్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి ఓ నివేదికను సిద్దం చేసి రాహుల్ టేబుల్ మీదకు చేర్చిందట. దాంతోనే ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రెండో రోజు టి. కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలమని చెప్పుకొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసే నాయకులంతా హైదరాబాద్ లోనే ఉంటున్నారని.. ప్రజల్లోకి వెళ్ళడం లేదని ఎస్కే టీమ్ రాహుల్ గాంధీకి సమర్పించిన నివేదికలో పెర్కొందట.

దీంతో చిర్రేత్తుకొచ్చిన రాహుల్ ఎమ్మెల్యేలను , సీనియర్ నేతలను హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారంతో రాహుల్ గాంధీ మాట్లాడే సరికి సీనియర్ నేతలు తెల్లమొహం వేశారట. ఈ పక్కా సమాచారం రాహుల్ గాంధీకి ఎలా చేరి ఉంటుందని ఆరా తీసే సరికి వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే ఫలితమని తెలిసిందట. రాహుల్ టూర్ తరువాత గ్రామాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నా టి. కాంగ్రెస్ నిర్ణయం వెనక వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉన్నారని సమాచారం. టీఆర్ఎస్ పై వ్యతిరేకత భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో గ్రామాల్లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాల్సిందిపోయి.. హైదరాబాద్ లోనే ఉంటే అధికారం కష్టమనే నివేదికను ఎస్కే టీం పెర్కొందట. దీంతో జనాల్లోకి వెళ్లాలని టి. కాంగ్రెస్ నిర్ణయించిందట.

మరోవైపు.. డీసీసీ ల పని తీరేమి బాగోలేదని సునీల్ టీం నివేదించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎప్పటి నుంచో పెండింగ్ లోనున్న జిల్లా అద్యక్షుల మార్పుపై సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదికతో మోక్షం లభించే అవకాశం ఉంది. త్వరలోనే జిల్లా అద్యక్షులను మార్చి కాంగ్రెస్ స్పీడ్ పెంచనుంది.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.