ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత మహిళ బైఠాయించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో చోటుచేసుకుంది.
గత శుక్రవారం రాత్రి బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో అక్కడ కొంతసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఉదయం ప్రియుడు కిరణ్ అనే వ్యక్తి ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు. ఆమెకు మద్దతుగా మహిళా సంఘం నిలిచారు. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. బూర్గంపాడు మండలం సారపాకలో లవ్ స్టోరీ ఇష్యూఆలస్యం గా వెలుగులో కి వచ్చింది. పోలిస్ స్టేషన్ ఎదుట ప్రేమికురాలు చేస్తోన్న ధర్నాకు మహిళ సంఘాల మద్దతు తెలిపాయి.
కిరణ్ అనే యువకుడు తనని ప్రేమించి పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేస్తున్నాడని యువతి పిర్యాదు చేసి..15 రోజులు గడుస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.