విశాఖపట్నంలోని కొమ్మాదిలో పెళ్లి కుమారుడు.. తలపై జీలకర్ర, బెల్లం పెడుతుండగా వధువు ఉన్నట్టుండి కుప్పకూలిపోయి మరణించడంతో .. పెళ్లి కూతురి మృతిపై పలు రకాలుగా పుకార్లు షికార్లు, ట్విస్ట్లు వెలుగుచూశాయి. కొందరు ఆమె విషం తాగిందని.. మరికొందరు గన్నేరు పప్పు తిన్నదని.. పెళ్లి ఇష్టంలేదని ఇంకొందరు ఇలా వార్తలు వచ్చాయి. అయితే.. అసలేం జరిగింది..? ఈ ఘటన ఎలా చోటుచేసుకుందనే విషయాలపై వధువు సోదరుడు విజయ్ వివరాలు వెల్లడించాడు.
ఇద్దరి ఇష్టంతోనే పెళ్లి ఫిక్స్ చేశామన్నారు. ఫిబ్రవరిలోనే Marriage ఫిక్స్ అయిందని… ఇరు వర్గాలు కూడా బంధువులమేనని చెప్పారు. సోదరి సృజనకు ఆరోగ్య సమస్య ఉందని చెప్పారు. సృజన మృతిపై మా కుటుంబంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదని చెప్పారు. ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పెళ్లి రోజు అసుపత్రికి తీసుకెళ్లామన్నారు. ఆరోగ్యం కుదుట పడిందని… పెళ్లి సమయంలో మళ్ళీ స్పృహ కోల్పోయింది.. అంతే ఇంతకు మించి ఏమీ జరగలేదు’ అని విజయ్ మీడియాకు వెల్లడించాడు.