ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఇలాంటి పరిస్తితుల నడుమ విద్యా సంస్థలను రన్ చేసి.. విద్యార్థులను ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. ఎందుకు విద్యా సంస్థల నిర్వహణ పై ప్రభుత్వం మొండిపట్టుదలకు పోతుందని నిలదీస్తున్నారు.
కరోనా , ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమల్ని భయభ్రాంతుల మధ్య సర్కార్ చంపుకు తింటుందని మండిపడుతున్నారు. ఎందుకు సర్కార్ కక్ష్య సాధిస్తుందో అర్థం కావడం లేదని పెదవి విరుస్తున్నారు. మానవీయ కోణంలో ఆలోచించి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కరోనా ఎక్కడ సోకుతుందన భయం నీడలో చదువులు తమ బుర్రలకు ఎలా ఎక్కుతాయని ప్రశ్నిస్తున్నారు. కరోనా నిబంధనల నడుమ విద్యా సంస్థలను కొనసాగించినా ఒక్కరికీ కూడా కోవిడ్ సోకిందనే గ్యారెంటీ ఇవ్వగలరా అని నిలదీస్తున్నారు.