వైరల్ అవుతున్న ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఆర్ఆర్ఆర్ ఫొటోస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా… ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా కు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్ నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాటు నాటు అనే సాంగ్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో… జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పిక్‌ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక పిక్‌ లో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ చాలా హ్యండ్‌ సమ్‌ గా కనిపించారు. ఇక పిక్‌ చూసిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In మూవీస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *