బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క పూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని సీఎం తెలిపారు. ఒకనాడు సమైక్యపాలనలో విస్మరించబడిన బతుకమ్మను స్వయం పాలనలో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైపోయిన ప్రకృతి పండుగ బతుకమ్మ, నేడు ఖండాంతరాలకు విస్తరించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ విశ్వవ్యాప్త గుర్తింపును తెచ్చిందన్నారు.

బతుకమ్మను పల్లె పల్లెనా జరుపుకొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు నీటితో నిండి వున్నాయని, బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *