హాజీపూర్ వద్ద టెన్షన్..టెన్షన్ -అఖిలపక్ష నేతల అరెస్ట్

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని హాజీపూర్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు డీసీసీ అద్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు సడక్ బంద్ చేపట్టారు. పోలీసులు అఖిలపక్ష నేతలను ఆందోళన విరమించాలని కోరినా వారు వినకపోవడంతో సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, మాజీ ఎంపీ మల్లు రవితోపాటు కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కేతూరి వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *