రేవంత్ రెడ్డిపై రాజ్యద్రోహం కేసు..?

తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ పై స‌ర్కార్ లోలోపల రగిలిపోతుందా..? ఆయనపై రాజ్యద్రోహ్రం కేసులు పెట్టబోతుందా..?ఆయనను కొంతకాలం జైలుగోడలకు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుందా..?అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ వర్గాల నుంచి.

సీఎం కేసీఆర్ తాగుబోతుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయితే, మంత్రి కేటీఆర్ డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయ్యారంటూ తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా ఇవే విమర్శలను గుప్పిస్తున్నారు. కేటీఆర్ ను డ్రామారావు అంటూ మండిపడుతున్నారు రేవంత్. సైదాబాద్ హత్యచార ఘటనకు ప్రభుత్వమే కారణమని…విశ్వనగారాన్ని డ్రగ్స్ కు కేంద్రంగా మార్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాల నుంచి ఇవే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో సర్కార్ చాలా వరకు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అయితే, తాజాగా రేవంత్ రెడ్డిపై కేటీఆర్ స్పందిస్తూ… పెయిటింగ్ వేసుకొని బతికిన వ్యక్తికి జూబ్లీహిల్స్ నాలుగు ఇండ్లు ఎలా వ‌చ్చాయో బ‌య‌ట‌కు తీస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. తనకు డ్రగ్స్ తో ఎం సబంధమని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ ప్రమేయముందని నిన్నే aicc మెంబర్ బక్క జడ్సన్ ఈడీ కి లెట‌ర్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన కేటీఆర్…ఈడీకి లెటర్ ఇచ్చిన వాడు ఓ బఫూన్ అంటూ మండిపడ్డారు.

అదే సమయంలో ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఇక నుండి ఎవ‌డైనా ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే రాజ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌న్నారు. అంద‌రి బాగోతాలు మా దగ్గర ఉన్నాయ‌ని, అన్నీ బ‌య‌ట‌పెడ‌తామంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. దీంతో రేవంత్ పై రాజ్యద్రోహం కేసులు పెట్టె అవకాశం లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *