రెండు దశాబ్దాల పోరాటం తర్వాత మరోసారి అధికారాన్ని చేపట్టబోతున్న తాలిబన్లు

ఆఫ్గనిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈవాళ తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవిత్రమైన రోజుగా భావించే శుక్రవారం రోజునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈవాళ ఆఫ్గాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. నాటో బలగాలతో రెండు దశాబ్దాల పోరాటం తర్వాత తాలిబన్లు మరోసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు. అయితే తాలిబన్లకు అంతర్జాతీయ సమాజం నుంచి ఇంత వరకు మద్దతు లభించలేదు. కేవలం చైనా, పాకిస్థాన్, ఖతార్ మాత్రమే వారి నాయకత్వాన్ని గుర్తించాయి. రష్యా కొంత అనుకూలంగా కనిపిస్తోంది. చాలా దేశాలు వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. మానవ హక్కులను కాపాడటం, మహిళల స్వేచ్ఛ తదితర అంశాలలో తాలిబన్ ప్రభుత్వం వ్యవహరించే తీరును బట్టి సంబంధాలను ఏర్పరుచుకోవాలనే ధోరణిలో ఇతర దేశాలు ఉన్నాయి. మరోవైపు తాలిబన్ అధికార ప్రతినిధి ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ఆఫ్ఘనిస్థాన్ లో తమ రాయబార కార్యాలయాన్ని కొనసాగిస్తామని చైనా విదేశాంగ శాఖ తెలిపిందని చెప్పారు. తమ ప్రభుత్వంతో సంబంధాలను నెలకొల్పుతామని చెప్పిందని తెలిపారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఇంటర్నేషనల్

Leave a Reply

Your email address will not be published.