కారణం ఏదైతేనేం…తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు వైఎస్ షర్మిల. కాని ఆశించిన స్పందన రాకపోగా..ఆదిలోనే లుకలుకలు షర్మిల పార్టీ భవితవ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ఆమె పార్టీని పటిష్టం చేయాలనీ అన్ని దారులను వెతుకుతున్నారు. నిరుద్యోగుల కోసం దీక్షలు, ఓదార్పు యాత్రలు ఎన్ని చేసినా జనంలోకి వెళ్లలేకపోతున్నారు. జిల్లాల్లో పెద్ద నాయకులైనా కలిసి వస్తారనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా పోవటంతో… వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనం పేరిట వైఎస్ వర్ధంతి సందర్భంగా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ విజయమ్మ నేతలకు స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు.
గతంలో వైఎస్ తో సన్నిహితంగా మెలిగిన నేతలందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. కానీ, ఆశించినంత స్పందన రాలేదు. చాలామంది వస్తారని అనుకున్న వాళ్ళు కూడా రాలేదు. పైగా ఎప్పుడు లేనిది షర్మిల తెలంగాణాలో పార్టీ ఏర్పాటు చేశాక ఈ సభను నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. విజయమ్మ ఖచ్చితంగా షర్మిల కోసమే ఈ సంస్మరణ సభను నిర్వహిస్తుందని భావించి చాలా మంది నేతలు ఈ సభకు దూరంగానే ఉండిపోయారు. వైఎస్ అంటే అభిమానమే కాని ఈ సభకు రాలేమని విజయమ్మ సున్నితంగా తిరస్కరించారు. కాంగ్రెస్ నుండి ఒక్క ఎంపీ కోమటిరెడ్డి మాత్రమే అటెండ్ కాగా… గతంలో వైఎస్ తో సన్నిహితంగా ఉండి, రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్ అయిన ఉండవల్లి వంటి నేతలు మాత్రమే హజయ్యారు. నిజానికి వైఎస్ సెంటిమెంట్ తో కొద్దిమంది నేతలైన కలిసి రాకపోతారా అని షర్మిల టీం భావించింది. కానీ, మాజీ బ్యూరోక్రాట్లు తప్పా షర్మిలతో కలిసి పనిచేసేందుకు పొలిటికల్ లీడర్స్ ఎవరూ కలిసి వచ్చేలా కనపడలేదు. వచ్చిన ఒకరిద్దరు నేతలు కూడా వైఎస్ పై అభిమానంతోనే అని కుండబద్ధలు కొట్టేశారు. చూడాలి మరీ… షర్మిల అడుగులు ఎలా ఉంటాయో..