ముఖ్యమంత్రి బాధ్యతలు కేటీఆర్ కు అప్పగిస్తారని, త్వరలోనే పార్టీ బాధ్యతలన్నీ చూస్తారని చాలా కాలంగా ప్రచారం అయితే జరుగుతోంది. కాని ఇప్పటి వరకు ఈ విషయంలో సరైన క్లారిటీ లేకపోగా..కన్ఫ్య్యూజన్ నెలకొంది. ప్రగతి భవన్ నుంచి ఈ లీకులు బయటకు వచ్చినా…కేటీఆర్ సిఎం అనే నినాదం వాయిదా పడుతూ వస్తోంది. కాని ఇప్పుడు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన జరగడంతో…ఈసారి మాత్రం త్వరలోనే ఓ ఖచ్చితమైన నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు విశ్లేషకులు.
టీఆర్ఎస్ నేతల ఢిల్లీ పర్యటన ఇప్పుడు పార్టీలో మళ్లీ కొత్త చర్చకు దారి తీసింది. హస్తినలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ జరిగింది. అయితే ఈ పర్యటనలో ఎమ్మెల్యే బాల్క సుమన్ మినహా కేటీఆర్ టీం అంత హస్తినలోనే వాలిపోయింది. కార్యక్రమం ఆసాంతం కేటీఆర్ హడావిడి కనిపించడంపై రకరకాల విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ ఆఫీసు శంకుస్థాపన కార్యక్రమానికి ముందే రోజే ఆయన తన టీంతో కలిసి హస్తిన బయల్దేరి…అంత తానై నడిపించారు కేటీఆర్. అక్కడ పూజా కార్యక్రమం కేసీఆర్-కేటీఆర్ సెంట్రిక్ గానే ఈ కార్యక్రమం అంతా నడిచిందని, ముఖ్య పదవికి కేటీఆర్ ను ప్రొజెక్ట్ చేసే పని మళ్లీ మొదలుపెట్టినట్లే ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ఈసారి పక్కా ప్లాన్ తోనే రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.