తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన మూడు రోజులు ఉంటుందని తొలుత సమాచారం అందినా…తాజాగా కేసీఆర్ మరో రెండు రోజులు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో సమావేశం అనంతరమే కేసీఆర్ తిరుగు పయనం కావాలని నిర్ణయించుకోవడంతో మరో రెండు రోజులపాటు ఆయన హస్తినలో ఉండనున్నారు.
ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ నేడో.. రేపో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానిని కలవడానికి ఢిల్లీలోని తెలంగాణ సిఎం క్యాంపు కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఈ రోజే కలవాలని లెటర్ రాసింది. అయితే ఇంకా ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం రాలేదు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం కేసీఆర్ కలవాలని అనుకుంటున్నారు. బెంగళూరు పర్యటన ముగించుకుని వచ్చినందున అమిత్ షా అపాయింట్మెంట్ ఎప్పుడు ఫిక్స్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. వీరిద్దరినీ కేసీఆర్ కలవాలని అనుకుంటున్నా.. తొలుత రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈవాళ సాయంత్రమే ఢిల్లీ నుంచి హైదరాబాదుకు తిరుగు ప్రయాణం కావాల్సి ఉన్నది. అయితే ప్రధాని, అమిత్ షాను కేసీఆర్ కలవాలనుకుంటే మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.