జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో జాతీయ జెండా దిమ్మెపై టీఆర్ఎస్ జెండాను ఎగరేయడం వివాదస్పంగా మారింది.
టీఆర్ఎస్ జెండా పండగలో భాగంగా కోరుట్లలోని 24 వ వార్డులోని జాతీయ జెండా గద్దెపై టీఆర్ఎస్ జెండాను ఎగరేశారు స్థానిక నాయకులు. ఇది చూసిన స్థానికులు, పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకుల వ్యవహారశైలి జాతీయ భావాన్ని దెబ్బ తీసేలా జాతీయ జెండా గద్దెపై టీఆర్ఎస్ జెండాను ఎగరేశారని మండిపడుతున్నారు. జాతీయ జెండా కంటే కూడా టీఆర్ఎస్ జెండా మహోన్నతమైనదిగా భావించాలని ఇలా చేశారా అని కడిగి పారేస్తున్నారు. ఇంకా ఎక్కడ టీఆర్ఎస్ జెండాను ఎగరేసుకోవడానికి స్థలం దొరకలేదా అని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు కనిపించిన భూమిని కబ్జా చేసిన చందంగా నాయకులు కూడా….కనిపించిన చోటనే టీఆర్ఎస్ జెండాను ఎగరేయాలని ఫిక్స్ అయి…జాతీయ జెండాను ఎగరేసినట్టున్నారని చీవాట్లు పెడుతున్నారు.