మాహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వివాదాస్పదంగా ఉన్న సర్వే నెంబర్ 287/1 లో 3 ఎకరాల భూమిపై కోర్టు తీర్పుతో కాలనీ వాసులు అగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా లేకపోవడంతో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే కాలనీలో పోలీసులు భారీగా మొహరించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కాలనీలో 287/1 లో 3 ఎకరాల స్థలంపై కోర్టు తీర్పు తమకు అనుకూలంగా లేకపోవడంతో కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కోర్టు తీర్పుతో పోలీసు బందోబస్తు మధ్య ఇండ్లను కూల్చివేస్తుండగా కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాలనీ వాసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా…సహనం కోల్పోయిన కాలనీ వాసులు పోలీసు వాహనంపై రాలు విసిరారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.