ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా కర్నూల్ జిల్లా మిడ్తూర్ మండలం పైపాలెంలో బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. నందికొట్కూరు జనసేన నేత మనపాటి శ్రీనివాసులు నేతృత్వంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఏపీ వ్యాప్తంగా జనసేనాని పవన్ కళ్యాన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కర్నూల్ జిల్లా మిడ్తూర్ మండలంలోని పైపాలెంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు జనసేన నేత మనపాటి శ్రీనివాసులు హాజరు అయి…కేక్ కట్ చేసి పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని…స్వార్ధ రాజకీయాలను పక్కన బెట్టి ఏపీ రాజకీయాల్లో ఓ కొత్త శకానికి నాంది పలుకుతున్నాడని పవన్ కళ్యాణ్ పై అభిమానాని చాటుకున్నారు మనపాటి శ్రీనివాసులు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.