నెల్లూరు జిల్లా తాళ్లపాక సాయి బ్రహ్మ భూ వ్యవహారంలో సంచలన తీర్పు ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఐదుగురు ఐఎఎస్ లకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది.
ఐదుగురు ఐఏఎస్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. ఆ ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించింది. ఓ మహిళా భూమి తీసుకొని నష్ట పరిహారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లా తాళ్లపాక సాయి బ్రహ్మ భూ వ్యవహారంలో తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశించిన తరువాత కోడా చెల్లింపులను ఆలస్యం చేయడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి మహిళకు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఐదుగురిలో రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ కు నెల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రెండు వారాల జైలుతో పాటు వెయ్యి ఫైన్ వేసింది. అలాగే ఎస్ ఎస్ రావత్ కు నెల రోజుల జైలు శిక్ష, వెయ్యి ఫైన్, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు శిక్ష, వెయ్యి ఫైన్ విధించింది. మరొక ఐఏఎస్ కు కూడా శిక్ష విధించింది.