దళిత బంధుతో తెలంగాణ సిఎం దళితోద్దరకుడుగా మారారని కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. పదే పదే కేసీఆర్ జపం చేస్తూ హాట్ టాపిక్ గా మారారు. దళిత బంధు అందరికీ కష్టమేనని సొంత పార్టీ నేతలే ప్రకటనలు చేస్తుంటే మోత్కుపల్లి మాత్రం కేసీఆర్ పై అచెంచల విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకుంటారని గట్టిగా చెప్తున్నారు మోత్కుపల్లి. ఇప్పటి వరకు ఆయన ఈ మాటలను చెప్పినా..తాజాగా మరో అడుగు ముందుకేసి కేసీఆర్ కోసం తన ప్రాణన్నే పణంగా పెట్టేందుకు రెడీ అయ్యారు మోత్కుపల్లి.
తెలంగాణలో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసి తీరతారని గట్టిగా చెబుతున్నారు మోత్కుపల్లి. కేసీఆర్ ప్రకటనలపై సొంత పార్టీ నేతల్లోనుంచే అనుమానాలు వస్తుండగా…మోత్కుపల్లి మాత్రం ఆయన ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతారని చెబుతుండటం టీఆర్ఎస్ నేతలనే ఆశ్చర్యపరుస్తోంది. సీఎం ప్రకటించినట్లే చేస్తారనే నమ్మకం తనకు ఉందని.. ఒకవేళ అలా జరగకపోతే , దళిత బంధు వంద శాతం అమలు కాకపోతే .. తాను యాదగిరిగుట్టపై ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించి అందరికీ షాకిచ్చారు మోత్కుపల్లి. మోత్కుపల్లి మాటలు విన్నవారికి ఇప్పుడు నోటమాట రాకుండాపోతోంది. ఏడేళ్లుగా ఎన్నో హామీలు ఇచ్చి.. సులువుగా మరిచిపోయిన కేసీఆర్ఫై అంత నమ్మకమేంటో తెలియక నోరెళ్లబెడుతున్నారు. దళిత బంధు చైర్మన్ పదవి కోసమే.. మోత్కుపల్లి చివరికి ఇంత తెగింపుతో మాట్లాడుతున్నారమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.