వార్తల ఖండన – అవాస్తవ కథనాలు ప్రసారం చేస్తే సహించేది లేదు

తెలంగాణ ఉద్యమ నేతలు టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారని ఓ టీవీ చానెల్ లో వార్తలు రావడాన్ని ఖండించారు వనపర్తి జిల్లా జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి. ఉద్యమంలో కీలక పాత్ర పోషించి…తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలని టీఆర్ఎస్ లో చేరామని, టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ , మార్కెట్ చైర్మన్ లక్ష్మయ్య మీడియాతో మాట్లాడారు. అలాగే ఉద్యమ నేతలపై నిందలు మోపడం సరైంది కాదని…ఉద్యమ నేతలపై అపనిందలు మోపడం అంటే ఆకాశంపై ఉమ్మి వేయడమేనని అన్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published.