తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభం – విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో పిల్

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. పిల్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ పిల్ ను ఈ నెల 31కి వాయిదా వేసింది.

సెప్టెంబర్ ఒకటి నుంచి విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై ప్రైవేట్ టీచర్ బాలకృష్ణ పిల్ వేశారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందన్నారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం సరైంది కాదని వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. పిల్ పై ఈనెల 31న విచారణ చేపట్టనుంది తాత్కాలిక సీజే జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం. మరోవైపు రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని విద్యా సంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయమన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.