ఆయన చేయి పడిందంటే చాలు…ఆ పంచలోహ విగ్రహం చూపరుల మనస్సును ఆకర్షించాల్సిందే. అంతలా పంచలోహ విగ్రహ తయారీలో ప్రావీణ్యం సంపాదించారు ఆయన. ఆయన తయారు చేసిన పంచలోహ విగ్రహాల కొనుగోలు కోసం, అలాగే తయారు చేయించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పంచలోహ విగ్రహాల ప్రేమికులు ఆయన దగ్గరికి వస్తుంటారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టొరీ చూడాల్సిందే…
కర్నూల్ జిల్లా ఆదోని తాలూకా హనవలు గ్రామనికి చెందిన విశ్వకర్మ శ్రీ శ్రీ ధర్మనాచారి, జయమ్మ దంపతులకు 8వ పుత్ర సంతానమే విశ్వకర్మ బసవ ఆచారి.
చదువుపై ఆసక్తి లేకపోవడంతో పంచలోహ విగ్రహాల తయారీపై దృష్టి పెట్టాడు. పెద్దవాడుగురు మండలం శిల్పి బాబు ఆచారి దగ్గర శిష్యరికం చేసి పంచలోహ విగ్రహాలు తయారీ చేసే విధానం నేర్చుకున్నాడు బసవ ఆచారి. ఆ తరువాత కర్ణాటకకు చెందిన రమేష్ ఆచారి దగ్గర 4 సంవత్సరాలు పని నేర్చుకుని మరింత రాటుదేలాడు. తర్వాత శ్రీ శ్రీ సూక్షేత్ర హనవలు దుర్గాదేవి అమ్మ వారు ఆశీర్వాదంతో హనవలు గ్రామంలోనే పంచలోహ విగ్రహాలు తయారు చేస్తున్నాడు. అమ్మవారి కవచలు, కలసలు ఇతర పనులు చేస్తు పంచలోహ విగ్రహాల తయరీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు బసవ ఆచారి. ఈ పంచలోహ విగ్రహాల తయారీపై అనేక ప్రాంతలో పని చేసి ఔరా అనిపించుకున్నాడు.