అందరికీ దళిత బంధు కష్టమే..

దళిత బంధు అందరికీ వస్తుందని…ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని హుజురాబాద్ లో జరిగిన సభలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాలకు అభయం ఇచ్చి వెళ్ళారు. ఇక కేసీఆర్ ప్రకటనతో హమ్మయ్య అనుకుంటుండగా…సర్కార్ పెడుతోన్న రూల్స్ దళిత కుటుంబాల ఆశలపై నీళ్ళు చల్లేలా కనిపిస్తోన్నాయి. అందరికీ దళిత బంధు వస్తుందని ముఖ్యమంత్రి ఘంటా పథంగా చెప్పినా…గ్రౌండ్ లో ఆ మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

దళిత బంధుపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు…పథకం అమలు కోసం రూపొందించిన గైడ్ లైన్స్ కు అస్సలు పొంతనే లేదు. దళిత బంధు వర్తింపు కోసం సర్కార్ సర్వేలో పొందుపరిచిన అంశాలను చూస్తుంటే అందరికీ దళిత బంధు కష్టమేనని తెలుస్తోంది. దాదాపుగా 50 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించి.. వాటి ఆధారంగా వారికి దళిత బంధు వర్తింపేజేయాలా వద్దా అన్నది నిర్ణయించబోతున్నట్టుగా తెలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు పథకం అందుతుందని చెప్పారు కేసీఆర్. ఉద్యోగుల సంగతి అటుంచితే…ఇదివరకు భారీ రుణ సాయం పొందిన దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయడం కష్టమేనని సమాచారం. ఇదివరకు ఏదైనా దళిత పథకంలో లబ్దిదారులుగా ఉండి భారీ మొత్తంలో రుణ సాయాన్ని పొందితే వారికీ దళిత బంధు అనుమానమేనని తెలుస్తోంది. ఇక కుటుంబ మొత్తం వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2.50 లక్షలు మించినా దళిత బంధు రాదని సర్వేకోసం సిద్ధం చేసిన ప్రశ్నావళిని చూస్తోంటే అర్థమవుతోంది.

ఇక, హుజురాబాద్ లో దళిత కుటుంబాలకు 2.5 ఎకరాల మాగాణి భూమి లేదా మెట్టతో కలుపుకొని మొత్తం 5 ఎకరాలకు మించి సాగుభూమి ఉన్నా దళిత బంధు పథకం దక్కడం అనుమానమే. సర్కార్ కొలువు ఉన్నా రాదనీ సర్కార్ పొందు పరిచిన గైడ్ లైన్స్ లో పేర్కొన్నట్టు సమాచారం. కుటుంబానికి సొంతంగా ఫోర్ వీలర్ వాహనం కూడా ఉండొద్దని నిబంధనలు చెబుతున్నాయి. ఈ మార్గద‌ర్శకాల‌ను చూసి… ఇన్నాళ్లు ద‌ళిత బంధు ప‌థ‌కంపై ఆశ‌లు పెట్టుకున్నవారు.. కాస్త గుడ్లు తేలేస్తున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.