గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో ముస్లింలు రోడ్డెక్కారు. ఈద్గా స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం ఏంటని…అధికారుల తీరుపై మండిపడ్డారు.
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈద్గా స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలనే అధికారుల నిర్ణయంపై రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ముస్లింలు రోడ్డెక్కారు. తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈద్గా స్థలంలో ముస్లింలు అంత కలిసి ఆందోళన చేపట్టారు. తాము పవిత్రంగా భావించే ప్రదేశంలో ప్రభుత్వ కార్యలయను నిర్మించడం తమ మత విశ్వాసాలను దెబ్బ తీయడమేనని ముస్లింలు మండిపడ్డారు.
ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని…తక్షణమే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని సూచించారు. దీంతో ఈద్గా స్థలంలో పోలీసులు భారీగా మొహరించారు.