గిట్టుబాటు ధర లేక తనువు చాలిస్తోన్న రైతులవి ఆత్మహత్యలు కావని…అవి ప్రభుత్వ హత్యలన్నారు టీడీపీ నేత నరవ రమాకాంత్ రెడ్డి. రైతు సంక్షేమ సర్కార్ అని చెబుతోన్న జగన్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రభుత్వ పనితీరుకు మాయని మచ్చ అన్నారు ఆయన.
కర్నూల్ జిల్లా పెద్దకడబూరు మండలం పులికనుమలో ఆత్మహత్య చేసుకున్న బోయ ఈరన్న కుటుంబ సభ్యులను టీడీపీ అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి పరామర్శించారు. మృతుడి కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆయన. రైతులను ఆదుకుంటామని చెప్తున్నా సర్కార్…చేతల్లో మాత్రం ఏమి చేయడం లేదని మండిపడ్డారు ఆయన.