అమెరికాకు తాలిబాన్ల వార్నింగ్

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబాన్ల వికృతరూపం నెమ్మదిగా బయట పడుతోంది. కాబూల్ తమ చేతికి రాక ముందు శాంతి ప్రవచనాలు వల్లించినా తాలిబాన్లు అది తమ కంట్రోల్ లోకి రాగానే నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నారు. మ‌ళ్లీ ఒక‌నాటి త‌మ అకృత్యాల‌ను తిరిగి మొద‌లుపెట్టారు.

అమెరికా బలగాలు ఆఫ్గాన్ నుంచి ఎప్పుడు ఖాళీ చేస్తాయా అని గోతి కాడి నక్కలా ఎదురు చూస్తున్నాయి. వారు వెళ్ళిపోగానే అరాచకాలు మొదలు పెట్టేలా కనిపిస్తున్నారు. అయితే ఆగస్ట్ 31లోగా ఆఫ్గాన్ ను ఖాళీ చేయడం సాధ్యం కాకపోవచ్చునని అగ్రరాజ్యం చెప్తుండటంతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు తాలిబాన్లు. దీంతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు వారు తీవ్ర స్వరంతో కూడిన హెచ్చరిక‌ను పంపారు. చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆగస్ట్ 31 లోగా అమెరికా దళాలు ఆఫ్గాన్ ను ఖాళీ చేయాల్సిందేనని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాలిబాన్ ప్రతినిధి హెచ్చరించారు. గ‌డువు దాటి ఆప్ఘాన్‌లోనే ఉండిపోయి త‌మ‌ను రెచ్చగొట్టొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పటికీ వాళ్లు వెళ్లకపోతే అమెరికా బ‌ల‌గాల‌పై దాడులకు వెనుకాడ‌బోమ‌ని తెగేసి చెప్తున్నారు.

ఒప్పందం ప్రకారం అమెరికా తన బలగాలను ఉపసంహరించుకునే స్థితిలో అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. అమెరికా బలగాలకు సాయం చేసిన ఆఫ్గాన్లను తరలించే ప్రక్రియ పూర్తి అయ్యే వరకు బలగాలను అక్కడే ఉంచాలని భావిస్తోంది.

Load More Related Articles
Load More By admin
Load More In ఇంటర్నేషనల్

Leave a Reply

Your email address will not be published.