తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం సమీపంలో ఉన్న ‘భారతమాత’ విగ్రహాన్ని అధికారులు తొలగించడం వివాదాస్పదం అవుతోంది. భారతమాత విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని…ఇది ముమ్మాటికీ భారతమాతను అవమానించడమేనని అంటున్నాయి ప్రతిపక్షాలు.

అర్ధరాత్రి క్రేన్ సాయంతో సిఎం జగన్ ఇంటి సమీపంలోని భారతమాత విగ్రహాన్ని తొలగించారు. సీఎం ఇంటికి భద్రత పేరుతో విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చిందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహం తాడేపల్లికి ప్రధాన ఆకర్షణగా ఉండేది. భారతమాత విగ్రహం తొలగింపుతో తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.
అయితే రోడ్డు విస్తరణలో భాగంగా విగ్రహాన్ని తొలగించారని కూడా వార్తలు వస్తున్నాయి. ఏదీ ఏమైనా భారతమాత విగ్రహాన్ని తొలగించడం సరైంది కాదని అంటున్నారు.