ఈటల ఎంత మందికి పదవులు ఇప్పిస్తాడో..

ఈటల రాజేందర్ వ్యవహారంతో హుజురాబాద్ దశ, దిశ మారుతోంది. కేసీఆర్ అక్కడ గులాబీ జెండా ఎగరేసేందుకు హుజురాబాద్ పై అవాజ్యమైన ప్రేమను చూపిస్తున్నారు. ఒక్క ఈటలను ఓడించేందుకు కేసీఆర్.. ఆయన కలలో కూడా ఊహించని వారికీ పదవులను కట్టబెట్టాల్సి వస్తోంది. ఈట‌ల ఎపిసోడ్ తో తాజాగా మ‌రో ముఖ్య ప‌ద‌వి కూడా హుజురాబాద్ టీఆర్ఎస్ నేతనే వ‌రించింది.

తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా వ‌కుళాభ‌ర‌ణం కృష్ణమోహన్‌ను నియ‌మించారు కేసీఆర్. గతంలో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు వ‌కుళాభ‌ర‌ణం. ఈటల రాజీనామా చేసిన సమయంలో ఆయనపై పోటీకి వ‌కుళాభ‌ర‌ణం పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఆ అవకాశం చేజారినా…తాజాగా బీసీ క‌మిష‌న్ ఛైర్మన్ ప‌ద‌వి ద‌క్కింది. ఇక ఇప్పటికే టీఆర్ఎస్ కోవ‌ర్టుగా ప‌నిచేశార‌ని విమ‌ర్శలు మూట‌గ‌ట్టుకున్న కౌశిక్ రెడ్డిని గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు కేసీఆర్. అంత‌కుముందు ఈట‌ల ప్రధాన అనుచరుల్లో ఒకరైన బండా శ్రీనివాస్‌కు కీలక పదవి కట్టబెట్టారు కేసీఆర్. బండా శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమించారు.

Dr Vakulabharanam Krishna Mohan Rao named chairman of Backward Classes  Commission- The New Indian Express

హుజురాబాద్ ఉప ఎన్నికే లేక‌పోతే.. ఈ ప‌ద‌వుల‌న్నీ రాష్ట్రంలో ఎవ‌రెవ‌రికో ద‌క్కాల్సిన‌వి. ఏవేవో జిల్లాల‌కు చెందాల్సిన‌వి. కానీ ఈట‌ల పుణ్యమాని హుజురాబాద్ లీడ‌ర్లకు ప‌ద‌వుల పంట పండుతోంది. ప్రగ‌తి భ‌వ‌న్ చుట్టూ ఏళ్ల కొద్ది ప్రద‌క్షిణ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేకుండానే.. క‌నీస శ్రమ కూడా లేకుండానే.. ప‌ద‌వులే వ‌చ్చి లీడ‌ర్ల ఒళ్లో వ‌చ్చి వాలుతున్నాయి. వీరే కాదు.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే… ఎల్‌. ర‌మ‌ణ‌, పెద్దిరెడ్డి వంటి పార్టీలు మారిన నేత‌ల‌తో పాటు.. టీఆర్ఎస్‌ పార్టీకే చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు, ముఖ్య నేత‌ల‌కు కీల‌క‌ ప‌ద‌వులు ఉట్టిపై ఊరిస్తున్నాయి. చూడాలి మ‌రి ఈట‌ల కోసం కేసీఆర్ హుజురాబాద్ లీడ‌ర్ల కోసం ఇంకా ఎన్ని ప‌ద‌వులు త్యాగం చేస్తారో!

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.