మంత్రి మాటంటే లెక్కే లేదా-అధికారుల తీరుపై ఆగ్రహం

ఆ మంత్రి మాట అంటే లెక్కే లేదు అధికారులకు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకా, ఆ మధ్య వర్షాలు వచ్చిన సమయంలో రోడ్లపై వర్షపు నీరు భారీగా నిల్చి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం మేరకు వర్షపునీరు నిలిచినా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి…ఇక్కడి సమస్యను 48 గంటలలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కాని…మంత్రి మాటలను బుట్టదాఖలు చేశారు అధికారులు.

ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాల మండలంలోని ఇందిరా నగర్ కాలనీలో ఆ మధ్య కురిసిన వర్షానికి కాలనీ అంత జలమయం అయింది. కొన్ని చోట్ల మాత్రం చెప్పరాని పరిస్థితి. ఇంటి ముందు వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయటకు వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక సతమతం అయ్యారు. అసలే సీజనల్ వ్యాధుల సంక్రమణ నేపథ్యంలో ఇంటి ముందు వర్షపు నీరు భారీగా చేరి ఉండటంతో విషయాన్నీ మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకెళ్ళారు.

దాంతో ఆయన ఇందిరా నగర్ కాలనీని పరిశీలించి ప్రజలు పడిన ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. అనంతరం డ్రైనేజీ వ్యవస్థ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక అధికారులను మంత్రి ఆదేశించారు. 48 గంటల్లో పనులను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాని అధికారులు మాత్రం మంత్రి ముందు ఎదో తల ఊపాలి కనుక ఊపాం అన్నట్లుగా ఒకే అనేసి…మామా అనిపించారు అధికారులు. మంత్రి ఆదేశించిన అధికారులు మాత్రం పనులు చేపట్టకపోవడంపై స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంత్రి ఆదేశించిన పనులు చేపట్టారా అని మండిపడుతున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published.