ఓ మాతృమూర్తి ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని మమత ప్రెవేట్ హాస్పిటల్లో చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పెద్ద నెమలిపురి గ్రామానికి చెందిన ప్రవలిక అనే గర్భిణీ స్త్రీని కాన్పు కోసం పిడుగురాళ్లలోని మమత ప్రెవేట్ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ఆమెకు నెలలు పూర్తి కావడంతో ప్రసవం పోసుకునేందుకు ప్రవలిక ఆసుపత్రిలో చేరింది. కాగా వైద్యుల పర్యవేక్షణలో ఆమె ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇద్దరు మగపిల్లలు, ఓ చిన్నారి క్షేమంగా ఉన్నారని చెప్పారు డాక్టర్ దూళిపాళ్ల సునీత డాక్టర్.