రేవంత్ ఆన్ డ్యూటీ-ఇక కేసీఆర్ కు కష్టకాలమేనా..?

శత్రువును బలంతో డీకొట్టలేమని భావించినప్పుడు…కనీసం అతని వీక్ నెస్ అయినా గుర్తెరగాలి అన్నది విజేతల విన్నింగ్ కాన్సెప్ట్. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే కాన్సెప్ట్ ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ కు సభ్యులతో కేసీఆర్ సర్కార్ ను ఎదుర్కొనే అవకాశాలు లేవు. దీంతో ఆయనను ప్రజా క్షేత్రంలోనే దోషిగా నిలబెట్టాలని రేవంత్ అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించి…ప్రజలను ఎలా బోల్తా కొట్టిస్తున్నాడో చెప్పి…ప్రత్యర్ధికి దూకుడుకు ముకుతాడు వేయాలని ఒక్కో అడుగు కేర్ ఫుల్ గా వేస్తున్నారు రేవంత్.

హుజురాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు ఎంత ప్రతిష్టత్మకమో వేరేగా చెప్పనవసరం లేదు. అందుకే అక్కడ గెలించేందుకు కేసీఆర్ దళిత బంధును తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే దళిత, గిరిజనులను కేసీఆర్ ఎలా మోసం చేస్తున్నారో చెప్పేందుకు ఇప్పటికే ద‌ళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా మోగిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఇంద్రవెల్లి, రావిర్యాల సభలతో తెలంగాణ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు రేవంత్. ఇప్పటి వరకు ప్రభుత్వ తీరును ఎండగట్టిన రేవంత్…ఇపుడు తన ప్రత్యర్ధి కేసీఆర్ వైఖరిని టార్గెట్ చేశారు. ఈ నెల ఈ నెల 24న మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేసేందుకు రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. ఆయన అక్కడ దీక్ష చేపట్టడానికి చెప్పిన కారణంతో…కేసీఆర్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లేనని అంటున్నారు విశ్లేషకులు.

రేవంత్… మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేసేందుకు కారణం ఉంది. ఈ గ్రామాన్ని సిఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. ఇక గ్రామం అద్దంలా మెరిసిపోతుందని అంత అనుకున్నారు. కాని ఊహించిందేమి జరగలేదు. కేసీఆర్ దత్తత తీసుకున్నా అక్కడ అస‌లు అభివృద్ధే జ‌ర‌గ‌లేదన్నది రేవంత్ రెడ్డి వాద‌న‌. అందుకే కేసీఆర్ దత్తత తీసుకున్న మూడుచింతల పల్లి ఎంత అభివృద్ధి జరిగిందో మీడియాకు కూడా చూపించేందుకు ఆయ‌న అక్కడ దీక్షకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పి .. త‌న త‌దుపరి వ్యూహాలు కూడా ఎలా ఉంటాయో చెప్పక‌నే చెప్పారు రేవంత్ రెడ్డి.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.