రెండేళ్ళు ప్రేమించాడు. గర్భవతిని కూడా చేశాడు. కాని ఇపుడు నీ దారి నీది..నా దారి నాది అంటూ మరో యువతీతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్డమయ్యాడని తెలుసుకొని ప్రియుడి ఇంటి ఎదుట ప్రేమికురాలు దీక్షకు దిగింది. తనకు న్యాయం చేయాలని…లేదంటే తనకు చావే శరణ్యం అంటూ ప్రియుడి ఇంటి ఎదుట విలపించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపట్నం గ్రామానికి చెందిన కొలుకుల సంధ్యారాణి.. అదే గ్రామానికి చెందిన అల్లి అరుణ్ కుమార్ లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఆపై అతన్ని నమ్మిన సంద్యారాణి అరుణ్ తో శారీరకంగా ఒక్కటైంది. గర్భవతిని కూడా చేశాడు. ఆ తరువాత అరుణ్ తనలోని నటుడిని నిద్రలేపాడు.
ఇదివరకు అయ్యిందేదో అయింది..ఇప్పుడు నీ దారి నీది…నా దారి నాదంటూ తప్పించుకునేందుకు ప్లాన్ చేశాడు. కాని తన ప్రాణమే నీవని బతుకుతున్నానని…ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా అంటూ అరుణ్ ను నిలదీసింది. అయినా అరుణ్ మనస్సు కరగలేదు సరికదా…మరి యువతీతో పెళ్ళికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకొని సంధ్యరాణి ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు కూర్చుంది. ఉదయం ఆరు గంటలకే ప్రియుడి ఇంటి ముందు కూర్చొని తనకు న్యాయం చేయాలని స్థానికులను వేడుకుంది.