ఏపీలో డెడ్ లైన్ రగడ-ఆ రోజున ఎం జరుగుతుందో…?

స్వాతంత్య్ర దినోత్సవం రోజున నడి రోడ్డుపై గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్యకు న్యాయం చేయాలని 21 రోజుల డెడ్ లైన్ విధించింది టీడీపీ. దిశ చట్టంతో విప్లవాత్మక చట్టాన్ని తీసుకొచ్చామని చెబుతున్నా ప్రభుత్వం…దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితుడిని శిక్షించాలని ప్రధానంగా వాయిస్ రేస్ చేస్తోంది. ఇదే అంశాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. కాని టీడీపీ డిమాండ్ ను వైసీపీ సరిగ్గా పట్టించుకున్నట్లు అయితే కనిపించడం లేదు. మొత్తానికి అయితే 21 రోజుల తరువాత ఏపీలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయోనని అంత ఆసక్తిగా గమనిస్తున్నారు.

మహిళలకు భరోసా ఇవ్వాలంటే…దిశా చట్టం పకడ్బందీగా అమలు అవుతుందని నమ్మకం కల్గించాలంటే దిశా చట్టం ప్రకారం రమ్య హత్యా కేసు నిందితుడికి 21 రోజుల్లో శిక్షను విధించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో ఉద్ధృతంగా ప్రచారం చేయడమే కాదు.. నిరసనలు కూడా చేపడుతున్నారు. ఒక వైపు ప్రభుత్వ పెద్దలు అందరూ దిశ చట్టం అమలవుతోందన్న భావన ప్రజల్లో కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. హోంమంత్రి సుచరిత దిశ చట్టం కింద కేసులు పెడుతున్నామని కూడా చెబుతున్నారు. అయితే దిశా చట్టానికి కేంద్రం ఆమోదం తెలపలేదని కేంద్రమంత్రి మాటలను టీడీపీ ప్రధానంగా లేవనేత్తుతోంది. దీన్ని టీడీపీ మరింత అడ్వాంటేజ్‌గా తీసుకుంది. దిశ చట్టం అమలవుతూంటే ఆ చట్టం ప్రకారం ఇరవై ఒక్క రోజుల్లో నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తోంది.

టీడీపీ నేత నారా లోకేష్ ఈ విషయంలో లీడ్ తీసుకుని ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. దాదాపుగా ప్రతీ రోజూ సామజిక మాధ్యమాల్లో కౌంట్ డౌన్ పెట్టి గుర్తు చేస్తున్నారు. రమ్యకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నారా లోకేష్ పెట్టిన డెడ్‌లైన్‌ను వైసీపీ నేతలు పట్టించుకోనట్లుగా ఉంటున్నారు. కానీ.. సందర్భం వచ్చినప్పుడల్లా ఎన్ని మహిళల వేధింపుల కేసులు నమోదయ్యాయో..ఎంత వేగంగా చార్జిషీట్లు వేశామో చెబుతూ లెక్కలు విడుదల చేస్తున్నారు. కానీ దీనికి పోటీగా బాధితురాళ్ల కేసుల వివరాలను టీడీపీ బయట పెడుతోంది. మొత్తానికి 21 రోజుల తర్వాత రమ్య హత్య కేసులో మరింత రాజకీయం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.