ఉద్యమ తరహాలోనే ఉద్యోగాల కోసం-తెలంగాణ నిరుద్యోగుల ప్లాన్

నిరుద్యోగులు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సమాయత్తం అవుతున్నారు. నిరుద్యోగులను మోసం చేస్తూ కాలపయన చేస్తున్న తెలంగాణ సర్కార్ పై పోరాటం చేయాలని నిరుద్యోగ యువకులంతా దండు కట్టేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. తమ పోరాటానికి ప్రతిపక్షాల మద్దతు తీసుకొని రాజకీయంగా కూడా కేసీఆర్ సర్కార్ తీరును ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని డిసైడ్ అయ్యారు. నిరుద్యోగుల ఈ నిర్ణయంతో తెలంగాణలో మరో పోరాటం పురుడు పోసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది.

నోటిఫికేషన్ల జాడ అసలే లేదు…ఎంతసేపు గోర్లు, బర్ల ముచ్చటే గాని నిరుద్యోగులు పడుతోన్న ఇబ్బందులపై ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదని నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంపై కత్తులు నరుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే సర్కార్ కొలువు వస్తుందని ఆశిస్తే…ఉద్యోగాలు కాదు కదా కనీసం ఉపాధి అవకాశాలు కూడా కరువయయయని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. ఈ ముచ్చట దుబ్బాక ఉప ఎన్నికల నాటి నుంచి సర్కార్ చెబుతున్నా మాట. కాని కార్యరూపం దాల్చడం లేదు. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నికల్లోనూ ఇదే ముచ్చట చెప్పింది తెలంగాణ సర్కార్. కానీ ఇంతవరకు అతీగతీ లేదు. దీంతో నిరుద్యోగులు పోరాటాల ద్వారానే ఉద్యోగాలు సాధ్యమనే అవగాహనకు వస్తున్నారు. వినతి పత్రాలు ఇచ్చింది చాలునని…తెలంగాణ రాష్ట్రం కోసం ఎలాగైతే పోరాటం చేసినామో, అలాగే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉద్యమించాలని నిర్ణయించారు. పోరాటానికి నెలవుగా ఉన్న ఈ నేలపై పోరాటం చేస్తేనే హక్కులు వస్తాయనే అనుభవాన్ని ఆచరణలోకి తీసుకొని పోరాటానికి సమాయత్తం అవుతున్నారు.

గత జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో గ్రాడ్యుయేట్లు సూసైడ్ చేసుకున్నారు. ఇంకా.. ఎన్నాళ్లీ ఆత్మహత్యలు..? ఇదే నినాదంతో కలిసి పోరాడదాం.. ఉద్యోగాలు సాధించుకుందాం..? అంటూ ఉద్యమ కార్యాచరణను సిద్ధం అవుతున్నారు. కొద్ది రోజుల్లోనే లక్షల మందితో భారీఎత్తున ఉద్యమించేందుకు కార్యచరణ సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలు కూడా కలిస్తే.. నోటిఫికేషన్లు త్వరగా వస్తాయని భావిస్తున్నారు నిరుద్యోగులు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.