ఇదేంది కిషనన్నా-గిట్ల జేసినవ్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావడం చర్చనీయంశంగా మారింది. ఓ వైపు ఏపీలో బలపడాలంటే ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిందిపోయి…ఎంచక్కా జగన్ తో రాసుకుపుసుకు తిరిగితే ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందని ఆ పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నారు. మేమంతా పార్టీ పటిష్టత కోసం కష్టపడుతుంటే ఇలాంటి చర్యల వలన పార్టీపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదముందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

జన ఆశీర్వాద్ యాత్ర పేరిట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీలో పర్యటించారు. తిరుపతి, విజయవాడల్లో ప్రసగించారు. ఆ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆర్థిక పరిస్థితి కుప్పకూలిందని.. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. అయితే ఆ తర్వాత ఆయన సీక్రెట్‌గా వెళ్లి సీఎం జగన్‌తో సమావేశం కావడంతో ఏపీ బీజేపీ నేతలకు కక్కలేని మింగలేని పరిస్థితి ఏర్పడింది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేరుగా జగన్ ఇంటికి వెళ్లారు. ఈ వ్యవహారం ఏపీ బీజేపీలో చర్చనీయాంశమవుతోంది.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.