కేసీఆర్ సారూ…చాలా మారిపోయారు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ మునుపటి పంథాకు గుడ్ బై చెప్పినట్లు కనిపిస్తోంది. ఒకప్పటి కేసీఆర్ కు, ప్రస్తుత కేసీఆర్ కు చాలా డిఫరెంట్ కనిపిస్తోంది. ఇదివరకు ప్రగతి భవన్ లేదా, ఫార్మ్ హౌస్ కు పరిమితమైన ముఖ్యమంత్రి…ఇప్పుడు మాత్రం ప్రజల్లోకి వెళ్తుండటం ఆశ్చర్యపరుస్తోంది.

తెలంగాణ సిఎం కేసీఆర్ ఇటీవల వ్యవహరిస్తోన్న తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదివరకులా కాకుండా…ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. తన ప్రభ పడిపోతుందన్న భయమో లేక, ప్రత్యర్ధులు స్ట్రాంగ్ అవుతున్నారన్న ఆందోలనో తెలియదు కాని…గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుల త‌ర‌బ‌డి ప్రగ‌తి భ‌వ‌న్‌ను వ‌దిలేస్తున్నారు. ఇటీవల మూడు, నాలుగు జిల్లాలను చుట్టేసిన కేసీఆర్ తాజాగా మరికొన్ని జిల్లాలో కూడా పర్యటించాలనే ఆలోచనలో ఉన్నారు.

ఆగస్ట్ నెలాఖరులో వివిధ జిల్లాలో కేసీఆర్ పర్యటించే అవకాశం కనిపిస్తోంది. కొన్ని చోట్ల కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌ల ప్రారంభోత్సవం, మ‌రికొన్ని చోట్లకు కొత్తగా ప్రక‌టించిన మెడిక‌ల్ కాలేజీల‌కు శంకుస్థాప‌న కోసం వెళ్లనున్నారు. అధికారిక సమాచారం లేకపోయినా ఈ నెలలో చివర్లో లేదా…వచ్చే నెల మొదటి వారంలో కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

వచ్చే నెలలో నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జనగాం, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలను సందర్శిస్తారు. ఆయా జిల్లాల్లో కొత్తగా నిర్మించిన‌ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లను ప్రారంభిస్తారు. అలాగే వివిధ జిల్లాల‌కు ప్రక‌టించిన మెడిక‌ల్ కాలేజీల‌కు శంకుస్థాప‌న చేస్తారు. దీంతో కేసీఆర్ చాలా మారిపోయారని అంటున్నారు జనాలు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.