తెలంగాణలో సిఎం కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఏడాది కిందట దేశ వ్యాప్తంగా మంచి పని తీరు కనబరిచిన సిఎంలలో 9 వ స్థానంలో నిలిచినా కేసీఆర్…ఇప్పుడు అట్టడుగుకు చేరిపోయారు. ఆయన పని తీరు బాగోలేదని మెజార్టీ తెలంగాణ ప్రజలు పెదవి విరుస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎ ముఖ్యమంత్రి పని తీరు బాగుందని, ప్రజలు ఎక్కడ సంతృప్తిగా ఉన్నారనే అంశాలపై ‘ఇండియా టుడే’ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ అనే సర్వే నిర్వహించింది. ఇందులో ఆయా రాష్ట్రాల ప్రజల అభిప్రాయాన్ని సేకరించి అందుకు సంబంధించిన రిజల్ట్స్ ను విడుదల చేసింది. తాజాగా ‘ఇండియా టుడే’ విడుదల చేసిన సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా వెనకబడిపోయారు. కేవలం మూడు శాతం ఓట్లతో ఏపీ సీఎం జగన్‌కన్నా వెనక్కి వెళ్లారు. రాష్ట్రంలో 84 శాతం మంది సీఎం కేసీఆర్ పరిపాలనపై అసంతృప్తిగా ఉన్నట్టు సర్వే తేటతెల్లం చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రంలో మూడొంతుల మంది కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటేశారు.
తెలంగాణ జాతిపిత అని పిలిపించుకున్న కేసీఆర్ ప్రభ ఏడేళ్లకే మసకబారడం స్వయంకృతాపరాధమేనని అంటున్నారు విశ్లేషకులు. సీఎం కేసీఆర్ జూన్‌లో ప్రవేశపెట్టిన దళిత ఎంపవర్మెంట్ కూడా గ్రాఫ్‌లో గట్టెక్కించలేకపోయాయి.