ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. తాజాగా మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఇప్పటివరకు నమోదైన ఛార్జిషీట్ల ఆధారంగా విచారణ జరిపిన ఈడీ…వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులకు సంబంధించి కూడా రెండు ఛార్జిషీట్లు కోర్టుకు సమర్పించింది.
మనీలాండరింగ్ అభియోగాలతో ఈ ఛార్జిషీట్లు దాఖలయ్యాయి.11 ఛార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న ఈడీ.. ఇప్పటికే ఏడింటిని కోర్టుకు సమర్పించగా… తాజాగా మరో రెండింటిని దాఖలు చేసింది.