ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా విజృంభ‌ణ‌తో మూత‌ప‌డ్డ పాఠశాలలు ఈ రోజు నుంచి మ‌ళ్లీ ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యక్ష త‌ర‌గ‌తులు ప్రారంభించాల‌ని విద్యా శాఖ ఇచ్చిన‌ ఆదేశాల మేర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి.

Andhra Pradesh to reopen schools from July 13 but not for students -  Education Today News

అన్ని పాఠ‌శాల‌ల్లో తరగతి గదిలో 20 మందికి మించకుండా విద్యార్థుల‌ను కూర్చోబెట్టాల్సి ఉంటుందని విద్యా శాఖ ఆదేశించింది. అలాగే, ఇంటి నుంచి వ‌చ్చేట‌ప్పుడే విద్యార్థులు తమ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి తీసుకుని పాఠ‌శాల‌ల‌కు వెళ్లాలని సూచనలు చేసింది. విద్యార్థులతో పాటు టీచ‌ర్లు, ఇత‌ర‌ సిబ్బంది మాస్కులు త‌ప్పనిస‌రిగా ధరించాల్సి ఉంటుందని పేర్కొంది. పాఠ‌శాల‌లు తెరిచిన నేప‌థ్యంలో అన్ని బ‌డుల ప‌రిస‌‌రాల్లో శానిటైజ్‌ చేయించారు. విద్యార్థులు త‌ర‌గ‌తి గ‌దుల్లోకి ప్రవేశించే ముందు వారికి థర్మల్‌ స్క్రీనింగ్ చేస్తున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.