మొదటిసారి మాతృత్వాన్ని సరిగా ఆస్వాదించలేకపోయానని..అందుకే త్వరగా రెండో సంతానాన్ని కన్నట్టు పేర్కొంది బాలీవుడ్ నటి కరీనా కపూర్. ప్రెగ్నెన్సీ బైబిల్ పేరుతో పుస్తకం రాసి చర్చనీయాంశం అయిన కరీనా…పిల్లలను కనే సమయంలో తనకు ఎదురైన అనుభవాలను అందులో వివరించింది. పెద్ద కుమారుడు తైమూర్ పుట్టిన సమయంలో ఎలాంటి అనుభవం ఎదురైందో తాను రాసిన ప్రెగ్నెన్సీ పుస్తకంలో పేర్కొంది.

పెద్ద కుమారుడు తైమూరు డెలివరి సమయానికి కంటే ముందుగానే జన్మించాడని…దాంతో సీజేరియన్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది కరీనా. ఆ సమయంలో తీవ్ర మానసిక వేదనను అనుభవించినట్లు పేర్కొంది ఆమె. రెండు వారాల పాటు చనుబాలను కూడా ఇవ్వలేకపోయనని…తన జీవితంలో అది చాలా బాధాకరమైన సంఘటన అని తెలిపింది కరీనా. తన రెండో కుమారుడు జెహ్ జన్మించినప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయలేదని కరీనా పేర్కొంది.
