బీజేపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పాదయాత్రను సక్సెస్ చేయాలని భావిస్తోన్న పార్టీ అధిష్టానం…అందుకు తగ్గట్టు ఏర్పాట్లను చేయాలని నేతలకు సూచించింది. పాదయాత్ర ఆసాంతం పార్టీ కీలకనేతలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది.
గోల్కొండ కోట, మైసమ్మ దేవాలయం, మొయినాబాద్ క్రాస్ రోడ్, చేవెళ్ల క్రాస్ రోడ్, వికారాబాద్, మొమిన్ పేట, సదాశివపేటల మీదుగా పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. ఆయన పాదయత్ర ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడ ఆగాలి…ఎక్కడ ప్రసంగం చేయాలనే దానిపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. ఏదీ ఏమైనా పాదయాత్రను సక్సెస్ చేయాలనీ స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర నాయకత్వం.
నిజానికి ఆగస్ట్ 9 నుంచి ప్రారంభం కావాల్సిన బండి పాదయాత్ర పార్లమెంట్ సమావేశాలు, కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర వలన వాయిదా పడింది. దీంతో బండి పాదయాత్ర వాయిదా పడింది. ఈనెల 24న ఉంచి పాదయత్ర ప్రారంభం కాబోతోంది.