దక్షణాది భామ నయనతార , డైరక్టర్ విగ్నేష్ శివన్ మధ్య చాలా కాలంగా ప్రేమాయణం కొనసాగుతోంది. వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. అయితే పెళ్లి మాట ఎత్తేసరికి ఇద్దరు మౌనం వహిస్తున్నారు. కాని ఉన్నట్టుండి నయన్ బిగ్ బాంబ్ పేల్చింది. శివన్ తో తన ఎంగేజ్ మెంట్ అయిపోయిందని చెప్పడంతో ఈ వార్త దక్షినాది చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది.
ఈ ఏడాదిలో తమ పెళ్లి ఉంటుందని ఇటీవల శివన్ వెల్లడించారు. అందుకు కావాల్సిన డబ్బులు జామా చేసుకుంటున్నామని కూడా పెళ్లి వార్తలపై కావాల్సినంత క్లారిటీ ఇచ్చేశారు. నయన్ మాత్రం పెళ్లి వార్తలపై ఎప్పుడు నోరు విప్పలేదు. తాజాగా పెళ్లి వార్తలపై ఆమె స్పందిస్తూ…తమ ఎంగేజ్ మెంట్ అయిందని…దానికి సంబంధించి రింగ్ ను చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా నయన్ ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నయన్ తండ్రి అనారోగ్యానికి గురవ్వడంతో…ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా పెళ్లి చేసుకోవాలని నయన్ అనుకుంటున్నారట. అందుకే వీరి పెళ్లి త్వరలోన్ గ్రాండ్ గా జరగనున్నట్లు తెలుస్తోంది.